Allu Arjun: మరి కాసేపట్లో కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.. శ్రీతేజ్‌కు పరామర్శ

Allu Arjun To Visit KIMS Hospital Today

  • సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్
  • కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు
  • హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శిస్తారు. కిమ్స్‌కు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సమాచారం అందించడంతో ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

‘పుష్ప-2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్‌ను ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కూడా తనవంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటలకు ఆసుపత్రికి చేరుకుని శ్రీతేజ్‌ను పరామర్శించనున్నారు.

  • Loading...

More Telugu News