damodar rajanarasimha: హెచ్ఎంపీవీ వైరస్ అంటూ భయం కలిగించే ప్రచారం చేయద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ
- హ్యూమన్ మెటానియో వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి దామోదర
- ప్రజలను భయపెట్టేలా ప్రచారం చేస్తే చర్యలుంటాయన్న మంత్రి
- 2001లోనే హెచ్ఎంపీవీ గుర్తించారన్న దామోదర
ప్రజలను భయపెట్టేలా ఎవరైనా హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ)పై ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే హెచ్ఎంపీవీ కేసులు విదేశాలలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది.
ఈ క్రమంలో దీనిపై మంత్రి రాజనరసింహ స్పందించారు. ప్రజలు ఈ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 2001లోనే హెచ్ఎంపీవీ వైరస్‌ను గుర్తించారని చెప్పారు. శ్వాస వ్యవస్థపై ఈ వైరస్ స్వల్ప ప్రభావం చూపుతుందన్నారు. విదేశాల్లో హెచ్ఎంపీవీ కేసుల నమోదు, పరిస్థితులను పరిశీలిస్తున్నామని మంత్రి రాజనరసింహ తెలిపారు.