Krishna Bhgavan: నా వరకూ అది ఓ మిరాకిల్: నటుడు కృష్ణభగవాన్

Krishna Bhagavan Interview

  • హాస్యనటుడిగా కృష్ణభగవాన్ కి మంచి పేరు 
  • అనారోగ్య కారణాల వలన నటనకి దూరం 
  • ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగుతున్న ప్రయాణం
  • రమణుల తత్త్వం అర్థమైందన్న కృష్ణభగవాన్  


కృష్ణ భగవాన్ .. తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు పెట్టించిన హాస్య నటులలో ఒకరు. దర్శకుడు  వంశీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కృష్ణభగవాన్, ఆ తరువాత కాలంలో అంచలంచెలుగా ఎదుగుతూ వెళ్లారు. అనేక మంది స్టార్ కమెడియన్స్ తో కలిసి నటించారు. ఒకానొక దశలో ఆయనే హీరోగా సినిమాలు రూపొందాయి కూడా. అలాంటి కృష్ణ భగవాన్ ఆ తరువాత కాలు నొప్పి కారణంగా నటనకు దూరమవుతూ వచ్చారు. 

సినిమాల సంఖ్యను తగ్గించుకుంటూ వెళ్లిన ఆయన, నిదానంగా ఆధ్యాత్మికత దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆయన రమణుల తత్త్వానికి ఆకర్షితులయ్యారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'రమణ మహర్షి' గురించి ప్రస్తావించారు. "చాలా చిన్న వయసులోనే రమణ మహర్షికి ఆత్మ సాక్షాత్కారం కలిగింది. ఆయన చూపిన మార్గంలో నడవడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను" అని చెప్పారు. 

"ఒకసారి నేను 'అరుణాచలం' వెళ్లాను. నడవడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అయితే ఎక్కడికి వెళ్లినా నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రమణులు చూసుకున్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది. రమణాశ్రమంలో అంతా ధ్యానం చేస్తున్నారు. నేను క్రింద కూర్చోలేను. ఏం చేయాలా అని అనుకుంటూ ఉండగా, ఎవరో తెచ్చివేసినట్టుగా ఒక స్టూలు కనిపించింది. అది చాలామందికి ఒక సాధారణ విషయం కావొచ్చు. కానీ నా వరకూ అది ఒక మిరాకిల్. రమణుల తత్త్వం అర్థమయ్యాక 'నేను' అనే భావన తొలగిపోయింది" అని అన్నారు. 

  • Loading...

More Telugu News