Asif Ali: ఆ పాత్ర నేను చేయవలసింది: మలయాళ స్టార్ అసిఫ్ అలీ!

Asif Ali Interview

  • మలయాళంలో రూపొందిన 'మంజుమ్మేల్ బాయ్స్'
  • రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా
  • సుభాష్ పాత్ర కోసం తనని అడిగారన్న అసిఫ్ అలీ  
  • అందుకే ఆ సినిమా చేయలేకపోయానని వెల్లడి 
  • ఆ పాత్రను క్రేజ్ లేని ఆర్టిస్ట్ చేయడమే కరెక్ట్ అంటున్న ప్రేక్షకులు 
       
మలయాళంలో అసిఫ్ అలీకి మంచి క్రేజ్ ఉంది. ఓటీటీలో వచ్చే మలయాళ అనువాదాలు కారణంగా ఇతర భాషా ప్రేక్షకులకు కూడా ఆయన చేరువయ్యాడు. అసిఫ్ అలీ ఎంచుకునే కథలు .. పాత్రలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ మధ్యనే వచ్చిన ఆయన సినిమా 'కిష్కింద కాండం' బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను నమోదు చేసింది. 

అలాంటి అసిఫ్ అలీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'మంజుమ్మేల్ బాయ్స్' సినిమాలో తాను చేయవలసి ఉందని చెప్పాడు. ఈ సినిమాలో 'సుభాష్' అనే పాత్ర సొరంగ మార్గంలా కనిపించే ఒక అగాధంలోకి జారిపోతుంది. ఆ పాత్రను బయటికి తీసుకు రావడానికి మిగతా స్నేహితులంతా నానా తంటాలు పడతారు. యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన ఈ సినిమా, 240 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 

ఈ సినిమాలో సుభాష్ పాత్ర కోసం దర్శక నిర్మాతలు ముందుగా అసిఫ్ అలీని అనుకున్నారట. అయితే ఆ సమయంలో తన డేట్స్ లేకపోవడం వలన చేయలేకపోయానని అసిఫ్ అలీ అన్నాడు. అసిఫ్ అలీకి స్టార్ ఇమేజ్ ఉంది. ఆయన గుహలో పడిపోతే, ఆ పాత్ర తప్పకుండా బ్రతుకుతుందని ఆడియన్స్ గెస్ చేసేవారు. అందువలన ఆ పాత్రను వేరొకరితో చేయించడమే మంచిదైందనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్. 


మలయాళంలో రూపొందిన 

  • Loading...

More Telugu News