Jupalli Krishna Rao: కేటీఆర్ ఈ కేసును ఎదుర్కోవాల్సిందే!: మంత్రి జూపల్లి

KTR should face case says Jupalli Krishna Rao

  • ఫార్ములా ఈ-కార్ కేసును కేటీఆర్ ఎదుర్కోవాల్సిందేనన్న జూపల్లి
  • బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగిందన్న జూపల్లి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో తప్పు చేయనప్పుడు కోర్టుకు కేటీఆర్ ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. కేసును కేటీఆర్ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిందని... కేసు విచారణకు కేటీఆర్ హాజరు కావాలని చెప్పారు. బాన్సువాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే భూస్థాపితం అయిందని జూపల్లి అన్నారు. భవిష్యత్తులో కూడా ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. 

రైతు భరోసా కింద రైతులకు రూ. 21 వేల కోట్లను చెల్లించామని జూపల్లి తెలిపారు. కేసీఆర్ చేసిన అప్పులకు తమ ప్రభుత్వం ప్రతి నెల రూ. 6,500 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగిందని అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని అన్నారు.

  • Loading...

More Telugu News