Roja: ఆ తల్లి ఆవేదనకు బదులిచ్చే ధైర్యం ఉందా పవన్ కల్యాణ్?: రోజా
- ఇటీవల రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈవెంట్ నుంచి తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
- పవన్ కల్యాణ్ పై మండిపడుతున్న వైసీపీ నేతలు
రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై తిరిగి వెళుతున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడడం తెలిసిందే. ఈ సినీ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరైన నేపథ్యంలో, వైసీపీ నేతలు ఆయనను టార్గెట్ గా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు.
తాజాగా, మాజీ మంత్రి రోజా కూడా పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. మృతుల్లో ఒకరి తల్లి తీవ్రంగా రోదిస్తున్న వీడియోను ఎక్స్ లో పోస్టు చేసిన రోజా.... కన్నబిడ్డను కోల్పోయిన ఆ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతిమాటకు సూటిగా బదులిచ్చే ధైర్యం ఉందా పవన్ కల్యాణ్? అని ప్రశ్నించారు. ఆత్మ పరిశీలన చేసుకోండి... అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి! అంటూ రోజా ట్వీట్ చేశారు.