Puvvada Ajay Kumar: కేటీఆర్‌ను కావాలని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి: పువ్వాడ అజయ్

Puvvada Ajay sees conspiracy in e car racing

  • ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో రూపాయి అవినీతి జరగలేదన్న మాజీ మంత్రి
  • ఈ కేసులో న్యాయపరంగా పోరాడతామన్న పువ్వాడ అజయ్
  • కేటీఆర్ తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా ఆయన సిద్ధమేనన్న అజయ్

ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో రూపాయి అవినీతి కూడా జరగలేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ కేసులో తాము న్యాయపరంగా పోరాడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం చేయాలని కేటీఆర్ తమకు పిలుపునిచ్చారని చెప్పారు. పార్టీ అగ్రనేత పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను ఉద్ధృతం చేస్తామన్నారు. నిజంగా కేటీఆర్ తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా ఆయన సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

  • Loading...

More Telugu News