Ramcharan: కూతురు క్లీంకార ముఖాన్ని రివీల్ చేసేది అప్పుడేన‌ట‌.. అన్‌స్టాప‌బుల్ షోలో ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించిన చెర్రీ!

Ramcharan Will Reveal Daughter Klin Kaaras Face In Public On One Condition

  • ఈ నెల 10న 'గేమ్ చేంజర్' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న రామ్ చ‌ర‌ణ్‌
  • చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోలో పాల్గొన్న గ్లోబ‌ల్ స్టార్‌
  • ఈ సందర్భంగా కూతురు క్లీంకార ముఖాన్ని ఎప్పుడు చూపిస్తావంటూ చెర్రీకి బాల‌య్య ప్ర‌శ్న‌
  • క్లీంకార త‌న‌ను నాన్న అని పిలిచేన‌ప్పుడే ఆమెను ప్ర‌పంచాన్ని చూపిస్తానన్న చ‌ర‌ణ్‌

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సంక్రాంతి కానుక‌గా గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ నెల 10న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. దీంతో చిత్ర బృందం ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా రామ్ చరణ్ తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ షోలో సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ ఎపిసోడ్ ఈ నెల 8న ఆహాలో ప్ర‌సారం కానుంది. దాంతో నిర్వాహ‌కులు ఎపిసోడ్ తాలూకు ప్రొమోను విడుద‌ల చేశారు. ఇందులో తన కుమార్తె క్లీంకార‌ ముఖాన్ని ప్రపంచానికి ఎప్పుడు చూపించబోతున్నాడో చెర్రీ పంచుకున్నారు.  

ఇప్ప‌టివ‌ర‌కు క్లీంకార ముఖాన్ని చూపించ‌కుండా దాచారు క‌దా.. అస‌లు ఎప్పుడు మాకు ఆమె ముఖాన్ని చూపిస్తారు? అని బాల‌య్య ప్ర‌శ్నించారు. దానికి రామ్ చరణ్ వెంటనే స్పందించారు. "నేను ఆమె ముఖాన్ని రివీల్‌ చేస్తాను. కానీ దానికి ఒక షరతు ఉంది. ఆమె నన్ను నాన్న అని పిలిచినప్పుడు నేను ఆ ప‌ని చేస్తాను" అని చెప్పారు.

ఇక రామ్ చరణ్, ఉపాసన కామినేని 2012 జూన్‌లో వివాహం చేసుకున్నారు. అయితే, దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత 2023  జూన్‌లో ఈ దంప‌తుల‌కు క్లీంకార జ‌న్మించింది. దాంతో మెగా కుటుంబం ఆనందానికి అవ‌ధుల్లేవు. అందుకే రామ్ చరణ్ కూడా త‌న గారాల‌ప‌ట్టి తన జీవితంలోనే కాకుండా తన తండ్రి చిరంజీవి జీవితంలో కూడా ఒక వరం అని అన్నారు. 

  • Loading...

More Telugu News