R Krishnaiah: చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన ఆర్.కృష్ణయ్య

R Krishnaiah praises Chandrababu

  • చంద్రబాబు విజన్ ఉన్న నేత అని కొనియాడిన కృష్ణయ్య
  • పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడని కితాబు
  • విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళతానని వ్యాఖ్య

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి పాలనాదక్షుడని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. చంద్రబాబు విజన్ ఉన్న నేత అని అన్నారు. సంపదను సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడని కితాబునిచ్చారు. విద్యావేత్తలు, మేధావులకు చంద్రబాబుపై మంచి అభిప్రాయం ఉందని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కరిగిపోయే మనసున్న నేత అని అన్నారు. 

లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి విశాఖకు వస్తున్నారని కృష్ణయ్య తెలిపారు. మోదీకి నీరాజనం పలికేందుకు విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విశాఖ అభివృద్ధికి కావాల్సిన చర్యలను ప్రధాని తీసుకుంటారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళతానని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News