KTR: కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు

ACB Receives Another Complaint On KTR About ORR

--


తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టెండర్లలో అవకతవకలు జరిగాయని, ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ ఆరోపించారు. ఈమేరకు ఏసీబీకి మాజీ మంత్రి కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియపై విచారణ జరిపి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. 

కాగా, ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై కేటీఆర్ పై ఇప్పటికే ఓ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పెట్టుకున్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ను ఏసీబీ గురువారం విచారించనుంది.

  • Loading...

More Telugu News