Pooja Hegde: టాలీవుడ్లో జోరు చూపించే ఆ ముగ్గురు భామలు ఎవరు?

Tollywood Star Heroines Update

  • 1950ల నుంచి కొనసాగుతున్న ఆనవాయితీ 
  • వరుస సినిమాలతో దూసుకుపోయిన సావిత్రి - జమున - కృష్ణకుమారి
  • ఆ తరువాత జోరు చూపించిన వాణిశ్రీ - శారద - కాంచన 
  • దూకుడుగా వెళ్లిన విజయశాంతి - రాధ - భానుప్రియ


1950 నుంచి తీసుకుంటే తెలుగు తెరను ఎంతోమంది కథానాయికలు ప్రభావితం చేశారు. సావిత్రి - జమున - కృష్ణకుమారి వంటి వారు అటు నటన పరంగా ఇటు గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఎన్టీఆర్ - ఏ ఎన్నార్ సరసన ఈ ముగ్గురు నాయికలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు.ఈ ముగ్గుఋ నాయికలు కళ్లతో చేసిన విన్యాసాలు ఆ కాలంలోని ప్రేక్షకులను అలా కట్టిపడేసేవి. 

ఈ ముగ్గురు కథానాయికల ప్రభ కొనసాగుతూ ఉండగానే, వాణిశ్రీ - శారద - కాంచన ఎంట్రీ ఇచ్చారు. శారదకాస్త నిండుగా కనిపించే పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వగా, వాణిశ్రీ - కాంచన ఇద్దరూ కూడా కాస్త చురుకైన పాత్రలను చేస్తూ వెళ్లారు. ఆ తరువాత జనరేషన్ లో జయసుధ - జయప్రద - శ్రీదేవి కనిపిస్తారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష .. శోభన్ బాబు సరసన నాయికలుగా వీరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. 

ఇక ఆ తరువాత కాలంలో విజయశాంతి - రాధ - భానుప్రియ తమ దూకుడు చూపించారు. నటన పరంగా .. గ్లామర్ పరంగా .. డాన్సుల పరంగా కూడా ఈ ముగ్గురూ పోటీపడ్డారు. వీరి తరువాత జాబితాలో మనకు శ్రియ - కాజల్ - తమన్నా సుదీర్ఘమైన కెరియర్ ను చూసిన కథానాయికలుగా కనిపిస్తారు. ఆ తరువాతనే పూజ హెగ్డే - రష్మిక - కీర్తి సురేశ్ టాప్ త్రీలో కనిపిస్తారు. ఇంతవరకూ బాగానే ఉంది.  ఇక పై ఇలా ముగ్గురు హీరోయిన్స్ హవా కొనసాగే ఒక ఆనవాయితీకి బ్రేక్ పడనుందనే అనిపిస్తోంది. శ్రీలీల .. మీనాక్షి చౌదరి వంటి వారి మాటలు వినిపిస్తున్నా, ఇంకా ఎవరూ కుదురుకుని పరిస్థితినే కనిపిస్తోంది. చూడాలి మరి ఈ ఆనవాయితీ కొనసాగుతుందేమో.


  • Loading...

More Telugu News