Narendra Modi: కాసేపట్లో విశాఖకు ప్రధాని మోదీ... బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్న చంద్రబాబు

Modi will arrive Visakha shortly

  • విశాఖలో మోదీ పర్యటన
  • రోడ్ షో, సభకు హాజరుకానున్న ప్రధాని
  • రూ.2 లక్షల కోట్ల విలువైన పనులకు వర్చువల్ గా శంకుస్థాపన, ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం విశాఖలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఆయన విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు మోదీ విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయంలో ప్రధానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నమే విశాఖ చేరుకోగా... చంద్రబాబు కూడా కొద్ది సేపటి క్రితమే బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్నారు.

సాయంత్రం 4.45 గంటల నుంచి 5.30 గంటల వరకు ప్రధాని రోడ్ షో ఉంటుంది. ప్రధానితో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా పాల్గొనే ఈ రోడ్ షో... సిరిపురం సెంటర్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ వరకు నిర్వహించనున్నారు. రోడ్ షో అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. 

ఈ సభ సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు జరగనుంది. 6.50 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజి మైదానం నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు బయల్దేరతారు. రాత్రి 7.15 గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్ పయనమవుతారు. విశాఖలో మోదీ పర్యటన 3 గంటల పాటు సాగనుంది. 

విశాఖ సభ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పనుల విలువ సుమారు రూ.2 లక్షల కోట్లు. విశాఖ రైల్వే జోన్ ప్రధాన పరిపాలనా భవనం, ఇండస్ట్రియల్ హబ్, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూడిమడకలో ఏర్పాటయ్యే గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ తదితర ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు చేయనున్నారు. 

దేశంలోని పలు జాతీయ రహదారులు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీ నగర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు రైల్వే లైన్లు, గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు.

  • Loading...

More Telugu News