Narendra Modi: మోదీకి ఘనస్వాగతం పలికిన చంద్రబాబు, పవన్... రోడ్ షో ప్రారంభం... ఫొటోలు, వీడియో ఇవిగో

Modi and Chandrababu road show begins in Vizag

  • విశాఖలో మోదీకి ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం
  • సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు రోడ్ షో
  • రూ. 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. 

అనంతరం సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు రోడ్ షో ప్రారంభమయింది. ఈ రోడ్ షోలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొంటున్నారు. రోడ్డుకు ఇరువైపుల నిల్చున్న ప్రజలకు ప్రధాని అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈనాటి కార్యక్రమం సందర్భంగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రైల్వేజోన్, ఇండస్ట్రియల్ హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ లకు శంకుస్థాపన చేయనున్నారు.

  • Loading...

More Telugu News