KTR: కేటీఆర్ ఏసీబీ విచారణ... వీడియో, ఆడియో రికార్డింగ్ కు అనుమతించని హైకోర్టు

TG High Court denied permission for audio and video recordings of KTR enquiry

  • ఏసీబీ విచారణకు లాయర్ ను తీసుకెళ్లేందుకు కేటీఆర్ కు హైకోర్టు అనుమతి
  • ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీలో లాయర్ కూర్చోవాలని సూచన
  • ఏమైనా అనుమానాలుంటే మళ్లీ పిటిషన్ వేయాలన్న హైకోర్టు

ఫార్ములా ఈ-కార్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. అయితే, కేటీఆర్ విచారణను వీడియో, ఆడియో రికార్డు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరగా... దీనికి హైకోర్టు నిరాకరించింది. లాయర్ తో కలిసి రేపు ఏపీబీ విచారణకు వెళ్లాలని కేటీఆర్ కు సూచించింది. ఆ తర్వాత ఏమైనా అనుమానాలు ఉంటే మళ్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, హైకోర్టు కొన్ని షరతులు విధించింది.

విచారణ గదిలో కేటీఆర్, విచారణ అధికారులు మాత్రమే ఉంటారని... వారితో పాటు లాయర్ కూర్చోవడానికి కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ గదిలో లాయర్ కూర్చోవచ్చని తెలిపింది. లైబ్రరీలో కూర్చుంటే కేటీఆర్ విచారణ కనిపిస్తుందని హైకోర్టుకు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ తెలిపారు. దీంతో, లైబ్రరీలో లాయర్ కూర్చోవాలని హైకోర్టు సూచించింది. 


  • Loading...

More Telugu News