PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ సమ్మాన్‌ స్కీమ్ కొత్త లబ్దిదారులకు ‘రైతు గుర్తింపు ఐడీ’ తప్పనిసరి

key change in the registration process for new applicants under the PM Kisan programme

  • గుర్తింపు ఐడీ పొందిన రైతుల పేర్లు మాత్రమే స్కీమ్‌లో నమోదు చేస్తామని ప్రకటన
  • కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ 
  • ఇప్పటికే 10 రాష్ట్రాల్లో అమలవుతున్న నూతన విధానం

‘పీఎం కిసాన్ సమ్మాన్’ పథకం కింద దేశవ్యాప్తంగా రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే నూతన లబ్దిదారులు ‘రైతు గుర్తింపు ఐడీ’ని పొందడం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు గుర్తింపు ఐడీ పొందిన లబ్దిదారుల పేర్లను మాత్రమే స్కీమ్‌లో నమోదు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయించింది.

పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి నెలకు సగటున 2 లక్షల దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు గుర్తింపు ఐడీ ఉంటే దరఖాస్తు చేసుకున్న రైతుకు సొంత భూమి ఉందా? లేదా? అనేది తెలుస్తుందని, పథకానికి దరఖాస్తు చేసుకోవడం కూడా సులభంగా మారిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ‘ఫార్మర్స్ రిజిస్ట్రీ’లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, దరఖాస్తు ఫామ్‌లో రైతు గుర్తింపు ఐడీని ఇవ్వాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. కొత్త లబ్దిదారులకు తప్పనిసరి అయిన ఈ విధానం ఇప్పటికే 10 రాష్ట్రాల్లో 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో కూడా తప్పనిసరి చేస్తూ సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు.

నిజమైన రైతుల గుర్తింపు, మరిన్ని రైతు సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు గుర్తింపు ఐడీ చాలా ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కాగా, రైతు గుర్తింపు కార్డుపై రైతు పేరుతో పాటు భూమి ఎవరిది? ఆ భూమిలో పండిస్తున్న పంట ఏమిటి? రైతు పొందుతున్న సంక్షేమ పథకాల వివరాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News