Pawan Kalyan: తిరుపతి బయల్దేరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

AP Deputy CM Pawan Kalyan leaves to Tirupati

  • తిరుపతిలో తొక్కిసలాట
  • ఆరుగురు శ్రీవారి భక్తుల మృతి
  • ఘటన స్థలిని పరిశీలించనున్న పవన్

తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందడం తెలిసిందే. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఘటన స్థలిని సందర్శించి... ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు? అంటూ టీటీడీ ఈవో, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాజాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి తిరుపతి బయల్దేరారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పవన్ పరామర్శించనున్నారు. 

గత రాత్రి తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద అస్వస్థతకు గురైన వ్యక్తిని తరలించేందుకు పార్కు గేట్లను తెరవడంతో, భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో ఈ దుర్ఘటన జరిగింది. 

  • Loading...

More Telugu News