Sai Dharam Tej: చరణ్... ఆల్ ది బెస్ట్: సాయి దుర్గా తేజ్

Sai Dharam Tej best wishes to Ram Charan on release of Game Changer movie
  • రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'గేమ్ ఛేంజర్'
  • సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానన్న సాయి దుర్గా తేజ్
  • దిల్ రాజుకు ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవుతుందని వ్యాఖ్య
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' సినిమా రేపు ప్రేక్షకులకు ముందుకు వస్తోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో రామ్ చరణ్ రేంజ్ తారాస్థాయికి చేరుకుంది. దీంతో, ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అభిమానులు ఎంతో ధీమాగా ఉన్నారు. 

ఈ సినిమా విడుదల సందర్భంగా చరణ్ కు, మూవీ టీమ్ కు హీరో సాయి దుర్గా తేజ్ 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. "చరణ్... చాలా గ్యాప్ తర్వాత బిగ్ స్క్రీన్ పై నిన్ను చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. డైరెక్టర్ శంకర్ సార్ విజన్ ని జీవితంలోకి తీసుకొచ్చేందుకు నీవు చేసిన కృషికి ఆల్ ది బెస్ట్. 

దిల్ రాజు గారికి ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవుతుంది. తమన్, ఎస్ జే సూర్య, కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ లకు ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. 
Sai Dharam Tej
ramc
Dil Raju
Game Changer Movie
Tollywood

More Telugu News