Pawan Kalyan: తిరుపతిలో తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan visits stumpede site in Tirupati

  • తిరుపతిలో నిన్న రాత్రి తొక్కిసలాట
  • ఆరుగురు భక్తుల మృతి
  • రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా బైరాగిపట్టెడ వెళ్లిన పవన్
  • అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న వైనం

విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... నేరుగా తిరుపతి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వద్దకు చేరుకున్నారు. 

తిరుపతిలో నిన్న రాత్రి పద్మావతి పార్కు వద్ద ఉన్న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో... పవన్ కల్యాణ్ తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, డీఎస్పీ చెంచుబాబులతో మాట్లాడారు.

పవన్ కాసేపట్లో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

  • Loading...

More Telugu News