Game Changer: సంధ్య తొక్కిసలాట ఘటన... 'గేమ్ ఛేంజర్' థియేటర్లకు పోలీసుల సూచనలు

Police suggestions to Game Changer film theatres

  • పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన
  • గేమ్ ఛేంజర్ సినిమాకు అప్రమత్తమైన పోలీసులు
  • థియేటర్ల వద్ద ఎలాంటి హంగామా ఉండకూడదని సూచన

పుష్ప-2 విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గేమ్ ఛేంజర్ రేపు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు థియేటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. థియేటర్ల యజమానులకు పోలీసులు పలు సూచనలు చేశారు.

థియేటర్ల వద్ద ఎలాంటి హంగామా ఉండకూడదని పోలీసులు స్పష్టం చేశారు. టిక్కెట్లు తీసుకున్న ప్రేక్షకులను మాత్రమే లోనికి అనుమతించాలని థియేటర్ యాజమాన్యానికి సూచించారు. కాగా, విడుదల రోజు వేకువజామున 4 గంటలకు గేమ్ ఛేంజర్ సినిమా అదనపు షో ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

  • Loading...

More Telugu News