Pawan Kalyan: ఆనందించే సమయమా ఇది... తిరుపతిలో అభిమానులపై పవన్ ఫైర్
- తిరుపతిలో తొక్కిసలాట బాధితులకు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స
- పరామర్శించేందుకు వచ్చిన పవన్ కల్యాణ్
- అభిమానులు కేరింతలు కొట్టడంతో జనసేనాని ఆగ్రహం
తిరుపతి తొక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం స్విమ్స్ ఆసుపత్రికి వచ్చారు. అయితే అభిమానులు పవన్ ను చూసి కేకలు పెడుతూ, చేతులు ఊపుతూ, కేరింతలు కొడుతూ కోలాహలం సృష్టించారు. దాంతో పవన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఇది ఆనందించే సమయమా... బాధ అనిపించడం లేదా మీకెవ్వరికీ!... మనుషులు చచ్చిపోయారు... మనుషులు చచ్చిపోయారు అంటూ పదే పదే గట్టిగా అరిచారు. పోలీసులు ఏం చేస్తున్నారు... జనాన్ని కంట్రోల్ చేయండి... బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించవద్దు అంటూ అసహనం ప్రదర్శించారు.