Revanth Reddy: రైతు భరోసాపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy orders to collectors on Rythu Bharosa
  • జనవరి 26 నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలన్న సీఎం
  • పథకాల అమలుపై గ్రామాలు, మున్సిపాలిటీల్లో సభలు నిర్వహించాలని సూచన
  • 26 తర్వాత అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని వెల్లడి
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26 నుంచి పథకాలను అమలు చేయాలని, వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. పథకాల అమలుపై గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో సభలు నిర్వహించాలన్నారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లిస్తామన్నారు. పంట వేసినా, వేయకపోయినా సాగుకు అనుకూలమైన భూమికి మాత్రం రైతు భరోసా ఇవ్వాల్సిందే అన్నారు. అనర్హులకు మాత్రం రైతు భరోసా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను, అనర్హులను గుర్తించాలన్నారు. స్థిరాస్తి భూములు, లేఅవుట్లు, నాలా కన్వర్షన్, మైనింగ్, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను సేకరించాలన్నారు.
Revanth Reddy
Rythu Bharosa
Telangana
Congress

More Telugu News