Ramcharan: రామ్ చ‌ర‌ణ్ ఇంటి వ‌ద్ద అభిమానుల సంద‌డి... వీడియో వైర‌ల్‌!

Globalstar Ramcharan waves at Fans Who Came at Home too See Him
  
హైద‌రాబాద్‌లోని గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌రణ్ ఇంటి వ‌ద్ద మెగా అభిమానులు సంద‌డి చేశారు. బ్యాండ్ మోత‌లు, ట‌పాసులు పేలుస్తూ, గ్లోబ‌ల్ స్టార్ నినాదాల‌తో హోరెత్తించారు. ఫ్యాన్స్‌కు చెర్రీ బాల్క‌నీ నుంచి అభివాదం చేశారు. కాగా, శుక్ర‌వారం నాడు థియేట‌ర్ల‌లో విడుద‌లైన 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా తొలి రోజు రూ. 186 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు (గ్రాస్‌) సాధించిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

నిన్న (డిసెంబరు 10) ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన 'గేమ్ ఛేంజ‌ర్' టాక్‌తో సంబంధం లేకుండా భారీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డం విశేషం. అయితే, అల్లు అర్జున్ 'పుష్ప‌-2: ది రూల్' మొద‌టిరోజు వ‌సూళ్లు రూ. 294 కోట్ల‌కు ఈ మూవీ చాలా దూరంలో ఉండిపోయింది. కాగా, ఎన్‌టీఆర్ 'దేవ‌ర' తొలిరోజు క‌లెక్ష‌న్స్ రూ. 172 కోట్ల‌ను మాత్రం 'గేమ్ ఛేంజ‌ర్' బీట్ చేసింది. 
Ramcharan
Game Changer
Tollywood

More Telugu News