Vijayawada: హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లేవారికి విజయవాడలో ట్రాఫిక్ సమస్య తప్పింది!

- సంక్రాంతి సమయంలో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు
- గన్నవరం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖ వెళ్లే వారికి తప్పిన ట్రాఫిక్ ఇక్కట్లు
- విజయవాడలోకి వెళ్లకుండా... 30 కిలోమీటర్లు తగ్గిన దూరం
ప్రతి సంవత్సరం సంక్రాంతి, దసరా పండుగలకు హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అవుతుంది. పండుగ కోసం అందరూ సొంతూళ్లకు వెళతారు. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే రోడ్డు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలతో ప్రతి సంవత్సరం విజయవాడలో ట్రాఫిక్ సమస్య ఇబ్బందికరంగా మారేది. వాహనాలు విజయవాడ నగరం దాటాలంటే రెండు మూడు గంటలు పట్టేది.
అయితే ఈసారి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గింది. గన్నవరం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖ వైపు వెళ్లే వాహనాలను విజయవాడ లోనికి రానీయకుండా పోలీసులు గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్ద మళ్లిస్తున్నారు. ఈ దారి చిన్నఅవుటుపల్లి వద్ద తిరిగి కలుస్తుంది. దీంతో ప్రయాణం కూడా 30 కిలోమీటర్ల మేర తగ్గుతోంది. అలాగే ట్రాఫిక్ జామ్ సమస్య తప్పింది.