Naanaa Hyraanaa song: ఈ రోజు నుంచి 'గేమ్ చేంజర్' సినిమాలో 'నానా హైరానా' సాంగ్

Naanaa Hyraanaa song adding to Game Changer from today
  • రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్
  • జనవరి 10న విడుదల
  • ఈ రోజు నుంచి థియేటర్లలో నానా హైరానా సాంగ్ చూడొచ్చన్న చిత్రబృందం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త చిత్రం గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజైంది. 

కాగా, నేటి నుంచి ఈ చిత్రంలో 'నానా హైరానా' సాంగ్ ను కూడా జోడిస్తున్నట్టు చిత్రబృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. రిలీజ్ వెర్షన్ లో ఈ సాంగ్ లేదు. "మెలోడీ ఆఫ్ ద ఇయర్ అనదగ్గ 'నానా హైరానా' సాంగ్ ను నేటి నుంచి గేమ్ చేంజర్ సినిమాలో చూడొచ్చు... మీకు దగ్గరలో ఉన్న థియేటర్లలో కుటుంబ సమేతంగా గేమ్ చేంజర్ ను చూడండి" అంటూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. 

రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.
Naanaa Hyraanaa song
Game Changer
Ram Charan
Shankar
Kiara Advani

More Telugu News