sukumar: తన అభిమాన హీరో ఎవరో చెప్పిన సుకుమార్!

that hero made me believe that i can do anything in the Industry sukumar
  • తన అభిమాన హీరో రాజశేఖర్ అని పేర్కొన్న స్టార్ డైరెక్టర్ సుకుమార్
  • హీరో రాజశేఖర్ వల్లే తాను ఇండస్ట్రీలో ఏదైనా చేయగలనని నమ్మకం కలిగిందన్న సుకుమార్
  • చదువుకునే రోజుల్లో రాజశేఖర్ సినిమాలు బాగా చూసేవాడినన్న సుకుమార్
అల్లు అర్జున్‌తో పుష్ప, పుష్ప2 సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన అభిమాన హీరో ఎవరు అనేది వెల్లడించారు. తన అభిమాన హీరో వల్ల తాను ఇండస్ట్రీలో ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగిందని కూడా చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో అతి కీలకమైన విషయాలను సుకుమార్ పంచుకున్నారు. 
 
తాను హీరో రాజశేఖర్ అభిమానిని అని సుకుమార్ వెల్లడించారు. ఆయన నటించిన అంకుశం, ఆహుతి, అగ్రహం, తలంబ్రాలు, మగాడు తదితర సినిమాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పారు. చదువుకునే రోజుల్లో రాజశేఖర్ సినిమాలు బాగా చూసే వాడినని తెలిపారు. అప్పట్లో ఆయనను బాగా ఇమిటేట్ చేస్తుండేవాడినని, అది చూసిన తన స్నేహితులు అందరూ వన్స్ మోర్ అంటూ ఎంక్రేజ్ చేసేవారన్నారు. 

తన పెర్ఫామెన్స్‌కు అనేక మంది ఫ్యాన్స్ కూడా అయ్యారని చెప్పారు. తాను సినిమాల్లోకి వెళితే ఏదైనా చేయగలను అనే నమ్మకం హీరో రాజశేఖర్ వల్లే  కలిగిందంటూ గత విషయాలను చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సుకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  
sukumar
Movie News
Hero Rajashekar

More Telugu News