daaku maharaj: డాకు మహారాజ్ లో చిన్నారి... ఎవరీ వేద అగర్వాల్?

daaku maharaj know the interesting backstory of child actress vedha agarwal
  • డాకు మహారాజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బాలనటి వేద అగర్వాల్
  • ఇప్పటికే 'గాండీవధారి అర్జున'లో నటించిన వేద 
  • గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'జాట్'లోనూ నటిస్తున్న వేద
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సంక్రాంతి కానుకగా ఆదివారం థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది. ఈ మూవీలో వైష్ణవిగా నటించిన చిన్నారి నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ చిన్నారి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. 

తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న చిన్నారి పేరు వేద అగర్వాల్. ఈ చిన్నారి యాక్టరే కాదు, సింగర్ కూడా. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. 31వేల మందికి పైగా ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది. ఈ చిన్నారి కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందింది. అయితే వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది.  

ఎనిమిదేళ్ల ఈ వేద అగర్వాల్ ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'గాండీవధారి అర్జున'లో చిన్న పాత్ర చేసింది. గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'జాట్'లోనూ నటిస్తోంది.  
daaku maharaj
child actress
vedha agarwal
nandamuri bala krishna

More Telugu News