Nitish Kumar Reddy: మోకాళ్ల‌పై తిరుమ‌ల మెట్లు ఎక్కిన నితీశ్ కుమార్ రెడ్డి.. ఇదిగో వీడియో!

Telugu Cricketer Nitish Kumar Reddy Climbs Tirumala Through His Knees
  • మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితీశ్‌
  • దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన తెలుగు క్రికెట‌ర్‌
  • ఇటీవ‌ల బీజీటీ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన నితీశ్ రెడ్డి
టీమిండియా క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కాలిన‌డ‌క‌న కొండ‌పైకి వెళ్లి, మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్‌ సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైర‌ల్‌గా మారింది. 

ఇక గతేడాది నితీశ్ రెడ్డి ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అలా టీ20ల్లో అదరగొట్టిన తెలుగుతేజం.. ఆ తర్వాత అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు జట్టులో అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అటు బౌలింగ్‌లోనూ 5 వికెట్లు తీసి మంచి ఆల్‌రౌండర్ అనిపించాడు. ముఖ్యంగా ఈ సిరీస్ లో నితీశ్ చేసిన శ‌త‌కం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.
Nitish Kumar Reddy
Tirumala
Team India
Cricket

More Telugu News