jailer 2: రజనీకాంత్ జైలర్-2 టీజర్ ఇదిగో!

jailer 2 announcement teaser rajinikanth nelson dilpkumar anirudh
  • సంక్రాంతి సందర్భంగా రజనీకాంత్ జైలర్ 2 టీజర్ విడుదల
  • టీజర్‌లో కనిపించిన మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్
  • విడుదలైన కొద్దిసేపటికే విపరీతమైన వ్యూస్ సొంతం చేసుకున్న జైలర్ 2 టీజర్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, నటన పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాక అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.

జైలర్ సినిమాలో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ నటులు అతిధి పాత్రల్లో ఆకట్టుకున్నారు. వినాయకన్, తమన్నా భాటియా, వసంత్ రవి, మీర్నా మీనన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో సందడి చేశారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజునే మంచి కలెక్షన్లు సాధించి అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందింది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్‌గా జైలర్ 2 సినిమా కూడా వస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జైలర్ 2 టీజర్‌ విడుదలయింది. ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ టీజర్‌కి జనాల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ టీజర్‌లో మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కనిపించడం విశేషం. 

ఈ మూవీలో మరింత వైలెన్స్ ఉండనుందని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. జైలర్ 2లో రజనీకాంత్‌తో పాటు జైలర్ 1లో కనిపించిన ప్రధాన తారాగణం కూడా కొనసాగుతుండటంతో ప్రేక్షకులలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ సోషల్ మీడియాలో విడుదలైన కొద్దిసేపటికే విపరీతమైన వ్యూస్‌ను సొంతం చేసుకోవడంతో ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధిస్తుందో వేచి చూడాలి. 
jailer 2
rajinikanth
Movie News
jailer 2 teaser

More Telugu News