BSNL: డేటా అధికంగా వినియోగించే యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్స్

BSNL has come up with two plans which are focused on people who use a lot of data
  • బడ్జెట్ ధరల్లో రెండు నయా ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వరంగ టెలికం సంస్థ
  • రూ.215 ప్లాన్‌తో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా ఆఫర్ ప్రకటన
  • రూ.628 ప్లాన్‌తో రోజుకు ఏకంగా 3జీబీ డేటా అందిస్తున్న బీఎస్ఎన్ఎల్
డేటాను అధికంగా వినియోగించే కస్టమర్ల కోసం ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. బడ్జెట్ ధరలోనే విస్తృతమైన ప్రయోజనాలను అందించింది. ఒక ప్లాన్‌ను 30 రోజుల వ్యాలిడిటీతో, మరో ఆఫర్‌ను 84 రోజుల చెల్లుబాటుతో ప్రవేశపెట్టింది. మార్కెట్‌లో ప్రత్యర్థి కంపెనీలు అందిస్తున్న ఆఫర్లతో పోల్చితే ఈ ప్లాన్ల బెనిఫిట్స్ ఆకర్షణీయంగా అనిపిస్తున్నాయి.
 
రూ.215 ప్లాన్ వివరాలు ఇవే
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. లిమిట్ అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ తగ్గిపోతుంది. ఇక, అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు.

రూ. 628 ప్లాన్ వివరాలు ఇవే
ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. రోజుకు ఏకంగా 3జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 84 రోజులకు కలిపి మొత్తం 252జీబీ డేటా వినియోగించుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్‌, దేశమంతటా ఉచిత రోమింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. టెలికం మార్కెట్‌లో విభిన్న కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్లను ప్రకటించింది.
BSNL
BSNL Offers
Recharge Offers
Business News

More Telugu News