Saif Ali khan: సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చిరంజీవి

Megastar Chiranjeevi Reaction On Saif Alikhan Attack
  • చోరీకి వచ్చిన దుండగుడి చేతిలో సైఫ్ కు కత్తిపోట్లు
  • సైఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కరీనా టీమ్ ప్రకటన
  • దాడి విషయం తెలిసి కలత చెందానన్న మెగాస్టార్
సైఫ్ అలీఖాన్ పై దాడి విషయం తెలిసి ఎంతగానో కలత చెందానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి ముంబైలోని సైఫ్ అలీఖాన్ నివాసంలో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారని, కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారని సమాచారం. ఈ విషయం తెలిసి టాలీవుడ్ హీరోలు ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. సైఫ్ సర్ పై దాడి విషయం తెలిసి షాక్ అయినట్లు చెప్పారు.

సైఫ్ అలీఖాన్ భార్య, నటి కరీనా కపూర్ టీమ్ ఈ ఘటనపై స్పందించింది. సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘బుధవారం రాత్రి సైఫ్, కరీనా నివాసంలో చోరీ యత్నం జరిగింది. దుండగుడి దాడిలో సైఫ్ చేతికి గాయమైంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో మీడియా, అభిమానులు సంయమనంతో వ్యవహరించాలని కోరుకుంటున్నాం. ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు’’ అని కరీనా టీమ్ పేర్కొంది.
Saif Ali khan
Megastar
Chiranjeevi
Saif Stabbed
Kareena kapoor

More Telugu News