Manchu Manoj: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసిన నటుడు మంచు మనోజ్

Manchu Manoj meets Ranga Reddy collector
  • కొన్నిరోజులుగా మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు
  • మంచు మనోజ్‌కు ఇటీవల నోటీసులు పంపిన కలెక్టర్
  • ఈ క్రమంలో వివరణ ఇచ్చేందుకు కలెక్టర్‌ను కలిసిన మనోజ్
సినీ నటుడు మంచు మనోజ్ నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిశారు. గత కొన్నిరోజులుగా వివాదాలతో మోహన్ బాబు కుటుంబం పతాక శీర్షికలకు ఎక్కుతోంది. తాజాగా మనోజ్ కలెక్టర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి కలెక్టర్‌తో చర్చించారు.

తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్ బాబు ఇటీవల మేజిస్ట్రేట్‌ను అశ్రయించారు. జల్‌పల్లి‌లోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు. అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో వివరణ ఇచ్చేందుకు మంచు మనోజ్ తాజాగా కలెక్టర్‌ను కలిసినట్లుగా తెలుస్తోంది.
Manchu Manoj
Mohan Babu
Telangana
Hyderabad

More Telugu News