RBI: బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం!

RBI suggests bank account holders to add nominee to their accounts
  • బ్యాంకు ఖాతాకు నామినీని తప్పనిసరి చేసిన ఆర్బీఐ
  • నామినీ జోడించని ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు గుర్తింపు
  • దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిక
బ్యాంకు ఖాతాలకు నామినీని తప్పనిసరి చేస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. కొత్తగా తెరిచే ఖాతాలతోపాటు ఇప్పటికే ఖాతాలు ఉన్నవారు కూడా నామినీని తప్పనిసరిగా చేర్చుకోవాలని కోరింది. నామినీని జోడించని ఖాతాల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేటు బ్యాంకుల్లోని ఖాతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. 

ఖాతాలకు నామినీని జోడించకపోవడం వల్ల భవిష్యత్తులో ఖాతాదారులు నష్టపోయే అవకాశం ఉందని, దురదృష్టవశాత్తు డిపాజిట్‌దారుడు మరణించినప్పుడు ఖాతాలోని సొమ్మును పొందేందుకు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే బ్యాంకు ఖాతాకు నామినీని తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించింది. 
RBI
Bank Accounts
Nominee

More Telugu News