Bandi Sanjay Kumar: ప‌వ‌న్‌, లోకేశ్‌తో బండి సంజ‌య్ చిట్‌చాట్‌.. ఫొటోలు షేర్ చేసిన బీజేపీ నేత‌

Bandi Sanjay Kumar Shares Photos of Conversation with Pawan Kalyan and Nara Lokesh
     
కేంద్ర‌మంత్రి అమిత్ షా ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మరో మంత్రి బండి సంజ‌య్ కూడా ఆయ‌న వెంట వ‌చ్చారు. ఉండ‌వ‌ల్లిలోని సీఎం చంద్ర‌బాబు నివాసం వ‌ద్ద డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో సంజ‌య్ కాసేపు ముచ్చ‌టించారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆయ‌న త‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పోస్ట్ చేశారు. 

ఇక రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ ప్రక‌టించ‌డంపై కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
Bandi Sanjay Kumar
Pawan Kalyan
Nara Lokesh

More Telugu News