Nasa: పాలపుంత పక్కనే ఆండ్రోమెడా గెలాక్సీ... నాసా అద్భుతమైన వీడియో!

andromeda galaxy panorama decade of hubble observations
  • విశ్వంలో ఎన్నో వందల కోట్ల గెలాక్సీలు
  • అందులో మన పాలపుంత (మిల్కీవే) ఒకటి
  • మనకు అన్నింటికన్నా దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా
  • దీనిని హబుల్ టెలిస్కోప్తో అద్భుతంగా చిత్రీకరించిన నాసా
మన విశ్వం అంటేనే ఎన్నో అద్భుతాలకు పుట్టినిల్లు. వందల కోట్ల గెలాక్సీలు, వేల కోట్ల నక్షత్రాలతో అలరారుతుంది. అలాంటి గెలాక్సీలలో మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీ వే) ఒకటి. ఇక అంతరిక్షంలో మనకు అన్నింటికన్నా దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. ఇవి రెండూ మెల్లగా ఒకదానికి మరొకటి దగ్గరగా వస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని వందల కోట్ల ఏళ్లలో రెండు గెలాక్సీలు ఢీకొని కలసిపోతాయని కూడా చెబుతున్నారు.

హబుల్ టెలిస్కోప్ తో...
మనకు దగ్గరగా ఉండి, భవిష్యత్తులో ఢీకొట్టబోయే ఆండ్రోమెడా గెలాక్సీపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్షంలో తిరుగాడుతున్న ప్రతిష్టాత్మక హబుల్ టెలిస్కోప్ తో ఈ గెలాక్సీని పదేళ్లుగా చిత్రీకరిస్తూ వచ్చారు. అలా చిత్రీకరించిన చిత్రాలన్నీ కలిపి అత్యంత పెద్ద చిత్రం ఒకదానిని తాజాగా రూపొందించారు. ఏకంగా 250 కోట్ల పిక్సెల్స్ తో రూపొందిన ఈ చిత్రంలో సుమారు 20 కోట్ల నక్షత్రాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇది కూడా ఆ గెలాక్సీలో కొంత భాగం మాత్రమేనని చెబుతున్నారు.

వీడియోగా రూపొందించి...
ఆండ్రోమెడా గెలాక్సీకి సంబంధించి రూపొందించిన అతిపెద్ద చిత్రానికి సంబంధించి నాసా ఓ వీడియోను రూపొందించింది. దానిని తాజాగా యూట్యూబ్ లో పెట్టింది. ఆ వీడియోను దిగువన చూడొచ్చు.

 
Nasa
andromeda
Milkyway
Hubble
Science
offbeat
Viral Videos

More Telugu News