Sankranti Holidays: ముగిసిన సంక్రాంతి సెలవులు... విజయవాడ బస్టాండ్, రైల్వేస్టేషన్ లో కిటకిట

Heavy rush in Vijayawada Bus Station and Railway Station after Sankranti Holidays concluded
  • రేపటి నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు
  • పిల్లలతో తిరుగు ప్రయాణమవుతున్న కుటుంబాలు
  • అదనపు బస్సులు ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ముగిశాయి. రేపటి నుంచి విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో, సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమవుతున్నారు. దాంతో బస్సులు, రైళ్లు క్రిక్కిరిసిపోతున్నాయి. ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పిల్లలకు సంక్రాంతి సెలవులు ముగియడంతో కుటుంబాలతో పయనమవుతున్నారు.  

తిరుగు ప్రయాణమవుతున్న వారితో విజయవాడ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లో రద్దీ విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ పలు ప్రాంతాలకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు ఆర్టీసీ అదనపు బస్సులు తిప్పుతోంది. 

ఇవాళ విజయవాడ నుంచి ఆర్టీసీ 133 అదనపు బస్సులు నడుపుతోంది. ఈ స్పెషల్ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తున్నారు. అయితే, ఈ అదనపు బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం ఉండదని ఆర్టీసీ స్పష్టం చేసింది.
Sankranti Holidays
Vijayawada
Special Buses
APSRTC
Andhra Pradesh
Telangana

More Telugu News