K Bapayya: శ్రీదేవికి చాలా అన్యాయం జరిగింది: దర్శకుడు కె బాపయ్య!

K Bapayya Interview
  • తెలుగులో వరుస హిట్స్ ఇచ్చిన బాపయ్య 
  • హిందీలోను స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న వైనం 
  • తన డైరెక్షన్ లో శ్రీదేవి 14 సినిమాలు చేసిందని వెల్లడి
  • రేఖతో ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉండేదని వివరణ
 
ఒకానొక సమయంలో ఇటు తెలుగులోనూ .. అటు హిందీలోను వరుస హిట్లతో దూసుకుపోయిన దర్శకుడిగా కె బాపయ్య కనిపిస్తారు. తెలుగులో 'నా దేశం' .. 'సోగ్గాడు' .. 'మండే గుండెలు' .. 'ముందడుగు' వంటి భారీ హిట్స్ ఆయన కెరియర్లో కనిపిస్తాయి. తాజాగా ఆయన ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్లి నిలదొక్కుకున్న దర్శకులు చాలా తక్కువ. కానీ నేను వరుస హిట్లతో ముందుకు వెళ్లాను. స్టార్ హీరోలు తమ ఇతర సినిమాలను గురించి నా సలహాలను తీసుకునేవారు. సెట్లో నేను నా పనిపై పూర్తి ఫోకస్ పెట్టేవాడిని. అందువలన హీరోయిన్స్ నన్ను బ్రేక్ అడగడానికి కూడా భయపడుతూ ఉండేవారు. హిందీలో నా ఫస్టు హీరోయిన్ 'రేఖ' అయినప్పటికీ, నా దర్శకత్వంలో 'శ్రీదేవి' 14 సినిమాల వరకూ చేశారు" అని అన్నారు. 

" శ్రీదేవి తెలుగు సినిమాలు చేసే సమయంలో వారి అమ్మగారి ప్రభావం ఎక్కువగా ఉండేది. బాలీవుడ్ కి వెళ్లిన తరువాత ఆమె ఎక్కువగా రేఖ సలహాలు తీసుకునేవారు. వాళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. మిథున్ చక్రవర్తితో శ్రీదేవి పెళ్లి జరిగిపోయింది. కానీ అతను ఆమె కెరియర్ గురించి ఆలోచించి బయటికి చెప్పలేదు. ఆ తరువాత ఆమె బోనీకపూర్ ను పెళ్లి చేసుకున్నారు. ఆమె మరణం సహజమైంది కాదని అంటారు. ఆమెకి చాలా అన్యాయం జరిగింది" అని చెప్పారు.

K Bapayya
Director
Sridevi
Rekha
Mithun Chakraborty

More Telugu News