Naga Chaitanya: ఖైరతాబాద్‌ ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్లిన‌ నాగ‌చైత‌న్య... కార‌ణ‌మిదే!

Actor Naga Chaitanya Went To Khairatabad RTO Office Today
  • డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్లిన చైతూ
  • ఆర్‌టీఓ కార్యాలయానికి హీరో వ‌చ్చిన విష‌యం తెలియ‌డంతో ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్‌
  • ప్ర‌స్తుతం 'తండేల్' మూవీతో బిజీగా నాగ‌చైత‌న్య‌
టాలీవుడ్ యువ న‌టుడు నాగచైతన్య ఖైరతాబాద్‌ ఆర్‌టీఓ కార్యాలయానికి వెళ్లారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ చేయించుకోవ‌డానికి ఆయ‌న ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్ల‌డం జ‌రిగింది. అక్క‌డ ఆయ‌న ఆర్‌టీఏ జాయింట్ కమిషనర్‌ రమేశ్‌ను కలిశారు. అనంత‌రం రవాణా శాఖ అధికారులు చైతూ డ్రైవింగ్‌ లైసెన్స్ రెన్యూవల్‌ ప్రక్రియను పూర్తి చేశారు.

ఇక ఆర్‌టీఓ కార్యాలయానికి నాగ‌చైత‌న్య వ‌చ్చిన విష‌యం తెలుసుకున్న అభిమానులు ఆయ‌న్ని చూసేందుకు ఎగ‌బడ్డారు. 

చైతూ సినిమాల విష‌యానికి వ‌స్తే... ప్ర‌స్తుతం ఆయ‌న 'తండేల్' మూవీలో న‌టిస్తున్నారు. రొమాంటిక్‌, యాక్ష‌న్‌ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రానికి చందూ మొండేటి డైరెక్ట‌ర్‌. 

నాగ‌చైత‌న్య స‌ర‌స‌న హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ పాట‌లు, టీజ‌ర్, పోస్ట‌ర్లు 'తండేల్‌'పై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. 
Naga Chaitanya
Khairatabad RTO Office
Tollywood

More Telugu News