Chandrababu: దావోస్ లో బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ

AP CM Chandrababu held meeting with Bill Gates in Davos
  • దావోస్ లో చంద్రబాబు టీమ్ పర్యటనకు నేడు మూడో రోజు
  • నేడు కూడా పలు కీలక సమావేశాలు
  • ఎన్నో ఏళ్ల తర్వాత బిల్ గేట్స్ ను మళ్లీ కలిశానంటూ చంద్రబాబు ట్వీట్ 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో నేడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 

బిల్ గేట్స్ తో తొలిసారిగా 1995లో కలిశానని... అప్పుడు తమ మధ్య ఐటీ గురించి చర్చ జరిగిందని వెల్లడించారు. ఇప్పుడు 2025లో మరోసారి గేట్స్ తో సమావేశమయ్యానని, అయితే ఈసారి తమ మధ్య ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంశం చర్చకు వచ్చిందని చంద్రబాబు వివరించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్ ను మళ్లీ కలవడం సంతోషం కలిగించిందని తెలిపారు.
Chandrababu
Bill Gates
Davos
Andhra Pradesh
Microsoft

More Telugu News