Arshdeep Singh: చాహల్ రికార్డును బద్దలు కొట్టిన అర్షదీప్ సింగ్

Arshdeep Singh breaks Chahal record in T20I
  • ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం
  • టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అర్షదీప్ రికార్డు
  • అతడి ఖాతాలో ప్రస్తుతం 97 వికెట్లు
  • 61వ టీ20లోనే ఘనత
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి కోల్‌కతాలో ఇంగ్లండ్‌‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ అర్షదీప్ సింగ్ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్ రికార్డు బద్దలైంది.  

ఈ మ్యాచ్‌లో ఫిలిప్ సాల్ట్, డకెట్ వికెట్లు తీసిన అర్షదీప్ ఖాతాలో మొత్తం 97 వికెట్లు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అర్షదీప్ తన 61వ టీ20లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇప్పటి వరకు 96 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న చాహల్ రికార్డు బద్దలైంది. ఇక, 90 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో, 89 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వరుసగా నాలుగైదు స్థానాల్లో కొనసాగుతున్నారు. 
Arshdeep Singh
T20 Wickets
Record

More Telugu News