Pawan Kalyan: సింగపూర్ కాన్సుల్ జనరల్ తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం

- పవన్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన సింగపూర్ దౌత్యాధికారులు
- పవన్ తో మర్యాదపూర్వక భేటీ
- ఏపీ-సింగపూర్ సంబంధాల బలోపేతంగా దిశగా సమావేశం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, సింగపూర్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ప్రజల సహకార, సంయుక్త అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.
ఈ భేటీపై సింగపూర్ దౌత్య కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. విజయవాడలో ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొంది. సింగపూర్-ఆంధ్రప్రదేశ్ మధ్య సుదీర్ఘ మైత్రి ఉందని వెల్లడించింది. ఏపీ-సింగపూర్ సంబంధాల బలోపేతం దిశగా ఈ సమావేశం జరగడం అభినందనీయమని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ పేర్కొన్నారు.