Chandrababu: కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో చంద్ర‌బాబు భేటీ

CM Chandrababu Meeting with Nirmala Sitharaman
  • దావోస్ నుంచి ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు
  • కేంద్ర‌మంత్రుల‌తో వ‌రుస భేటీలు
  • ఈరోజు సాయంత్రం విజయవాడ రాక
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల‌పై చ‌ర్చించారు. ఆర్థిక‌సాయం అందించాల‌ని ఆమెకు విజ్ఞ‌ప్తి చేశారు. అమ‌రావ‌తికి హ‌డ్కో రుణం, వ‌ర‌ల్డ్ బ్యాంక్ సాయం వంటి అంశాల‌నూ కేంద్ర‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

అనంత‌రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోనూ స‌మావేశం కానున్నారు. ఆ త‌ర్వాత‌ కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషితో సమావేశం అవుతారు. అనంతరం ఈరోజు సాయంత్రం చంద్రబాబు విజయవాడ బయల్దేరి రానున్నారు. 

కాగా, నాలుగు రోజుల పాటు వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సు కోసం దావోస్ ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్న విష‌యం తెలిసిందే. 
Chandrababu
Nirmala Sitharaman
New Delhi

More Telugu News