Samantha: ఆ ఫీల్ రాకపోతే నేను వర్క్ చేయలేను: సమంత

I have to feel that I better acted says Samantha
  • సాధారణంగా ఉండే సినిమాలను అంగీకరించడం లేదన్న సమంత
  • ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపే వాటినే ఎంచుకుంటున్నానని వెల్లడి
  • గొప్పగా నటించాననే ఫీల్ రాకపోతే వర్క్ చేయలేనని వ్యాఖ్య
ప్రస్తుతం తన జీవితంలో ప్రతి సినిమాను ఇదే చివరిదని భావించే దశలో ఉన్నానని సినీ నటి సమంత అన్నారు. సాధారణంగా ఉండే సినిమాలను ఎన్నో అంగీకరించొచ్చని... కానీ, కచ్చితంగా ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపే వాటినే ఎంపిక చేసుకుంటున్నానని చెప్పారు. వంద శాతం నమ్మితేనే ఆ పాత్రలను చేస్తానని, లేకపోతే చేయలేనని తెలిపారు. 

రాజ్ అండ్ డీకే ఎక్కువగా సవాలుగా అనిపించే పాత్రలనే రూపొందిస్తున్నారని... వారితో కలిసి వర్క్ చేయడం తనకు ఎంతో సంతృప్తిగా ఉంటుందని చెప్పారు. నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉండే పాత్రలను వారు రూపొందిస్తున్నారని ప్రశంసించారు. గొప్పగా నటించాను అనే ఫీల్ రాకపోతే తాను వర్క్ చేయలేనని అన్నారు. ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Samantha
Tollywood
Bollywood

More Telugu News