Factory Blast: మహారాష్ట్ర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి.. వీడియో ఇదిగో!

5 Feared Dead In Massive Explosion At Ordnance Factory In Maharashtra
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు
  • పేలుడు తీవ్రత 5 కిలోమీటర్ల దూరం వినిపించిందని వెల్లడి
  • భారీగా ఎగిసిపడుతున్న పొగ, మంటలు
మహారాష్ట్రలో భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వర్కర్లు చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ప్లాంట్ పైకప్పు కూలిపోయిందని, పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వినిపించిందని చెప్పారు. భారీగా పొగ, మంటలు ఎగిసిపడుతున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో దాదాపు 12 మంది వర్కర్లు విధుల్లో ఉన్నారని, అందులో ఇద్దరిని రక్షించామని అధికారులు చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
Factory Blast
Maharashtra
Ordinence Factory
5 dead
Viral Videos

More Telugu News