Viral Video: రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయిన యువకుడు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో ఇదిగో!

Man Miraculously Survives After Being Trapped Between Two Buses
    
ప్రమాదవశాత్తు రెండు బస్సుల మధ్య చిక్కుకున్న యువకుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. బస్టాప్ వద్దకు వచ్చిన బస్సును ఎక్కేందుకు యువకుడు దాని వద్దకు వెళ్తుండగా అదే సమయంలో  రాంగ్‌రూట్‌లో ఎడమవైపు నుంచి మరో బస్సు వేగంగా దూసుకొచ్చింది. దీంతో యువకుడు రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు. బస్సు అతడిని బలంగా రాసుకుంటూ వెళ్లడంతో కిందపడిపోయాడు. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా తప్పించుకున్నాడు. కిందపడిన యువకుడు లేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ ‘ఇది మిరాకిల్’ అని రాసుకొచ్చాడు.   
Viral Video
Tamil Nadu
Road Accident

More Telugu News