Allu Arjun: బాల‌కృష్ణ‌కు అల్లు అర్జున్ శుభాకాంక్ష‌లు.. అవార్డు అందుకోవ‌డానికి పూర్తి అర్హుల‌న్న బ‌న్నీ

Allu Arjun Congratulations to Nandamuri Balakrishna for Padma Award Honour
  • ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారానికి ఎంపికైన బాల‌కృష్ణ‌
  • ఇప్ప‌టికే ఆయ‌న‌కు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు
  • తాజాగా ఎక్స్ వేదిక‌గా బాల‌య్య‌కు విషెస్ తెలిపిన బ‌న్నీ
ఇటీవ‌ల కేంద్రం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డుల‌లో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు బాల‌కృష్ణ‌కు ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారం ద‌క్కిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్ప‌టికే ఆయ‌న‌కు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాల‌య్య‌కు విషెస్ తెలియ‌జేస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా పోస్టు పెట్టారు. 

"ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారానికి ఎంపికైన సంద‌ర్భంగా బాల‌య్య‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. తెలుగు సినిమాకు మీరు చేసిన సేవకు ఈ అవార్డు అందుకోవ‌డానికి అన్ని విధాలా అర్హులు. అలాగే త‌మిళ‌ న‌టుడు అజిత్‌కుమార్ విజ‌యం కూడా ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కం, ప్ర‌శంసనీయం. శోభ‌న‌, శేఖ‌ర్ కపూర్‌ల‌కు క‌ళ‌ల విభాగంలో ప‌ద్మ‌భూష‌ణ్ రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ప‌ద్మ అవార్డుల‌కు ఎంపికైన వారికి నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు" అని బ‌న్నీ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.    


Allu Arjun
Nandamuri Balakrishna
Padma Award
Tollywood

More Telugu News