Kumbh Mela: కుంభమేళాలో పుణ్యస్నానమాచరించిన కేంద్ర మంత్రి అమిత్ షా

Amit Shah takes holy dip at Triveni Sangam in Prayagraj during Maha Kumbh visit
  • త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అమిత్ షా
  • అమిత్ షాతో పాటు పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్, రాందేవ్ బాబా
  • ఎల్లుండి మౌని అమావాస్య రోజు దాదాపు 10 కోట్ల మంది వస్తారని అంచనా
కేంద్ర మంత్రి అమిత్ షా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహా కుంభమేళాకు భక్త కోటి తరలి వస్తోంది. 45 రోజుల పాటు జరగనున్న ఈ కుంభమేళాలో ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు అమిత్ షా కుంభమేళాలో పాల్గొన్నారు.

త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షాతో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు రాందేవ్ బాబా కూడా పుణ్యస్నానమాచరించారు. ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో ఆ రోజున 8 కోట్ల నుంచి 10 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 
Kumbh Mela
Amit Shah
Yogi Adityanath
BJP

More Telugu News