Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి కోర్టులో ఊరట

The court set aside summons order issued to CM Atishi in a defamation case
  • లోక్ సభ ఎన్నికలకు ముందు అతిశీ తీవ్ర ఆరోపణలు
  • బీజేపీలో చేరకుంటే ఈడీ అరెస్ట్ చేస్తుందని కాషాయ నేతలు చెప్పారన్న అతిశీ
  • ఈ వ్యాఖ్యలపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి ఊరట లభించింది. బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. గత లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీపై అతిశీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో చేరకుంటే ఈడీ ఆప్ నేతలను అరెస్ట్ చేస్తుందని కాషాయ పార్టీకి చెందిన కొందరు నాయకులు బెదిరించారని ఆమె ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రవీణ్ శంకర్ కపూర్ ఆమెపై కోర్టులో పరువు నష్టం పిటిషన్ కూడా దాఖలు చేశారు.

ఈ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. విచారణ జరిపిన న్యాయస్థానం అతిశీ ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, పార్టీని ఉద్దేశించి చేశారని పేర్కొంటూ పరువు నష్టం పిటిషన్‌ను కొట్టి వేసింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అతిశీకి కోర్టులో ఊరట లభించింది.
Atishi
BJP
New Delhi

More Telugu News