Chandrababu: జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

CM Chandrababu held TDP Parliamentary Party meeting ahead of Parliament Budget Sessions
  • చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
  • నిధుల సాధనకు సమన్వయంపై చర్చ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, నిధుల సాధనకు సమన్వయం, తదితర అంశాలపై ఎంపీలతో చర్చించారు. ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టే బిల్లుల అంశంపైనా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలతో పాటు పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. 

కాగా, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఐదేళ్లలో సాధించలేనివి తాము 7 నెలల్లోనే సాధించామని చెప్పారు. అమరావతి, పోలవరంకు నిధులు తెచ్చుకున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజి తీసుకువచ్చామని వెల్లడించారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రను లూటీ చేశారని, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు.
Chandrababu
TDP Parliamentary Party
Parliament Budget Sessions

More Telugu News