Thandel: వైజాగ్‌లో నా పరువు పోతుంది... ప్లీజ్‌: నాగచైతన్య

My honor will be lost in Vizag Please Naga Chaitanya
  • వైజాగ్‌లో 'తండేల్‌' ట్రైలర్‌ విడుదల 
  • అల్లు అరవింద్‌ తన జీవితంలో 'తండేల్‌' అంటోన్న నాగచైతన్య 
  • ఈ సినిమా టాక్‌ను వైజాగ్‌ నుంచే తెలుసుకుంటానని వెల్లడి
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'తండేల్‌'. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీవాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం నాడు వైజాగ్‌లోని శ్రీరామ పిక్చర్‌ ప్యాలెస్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ, "పుష్ప కా బాప్‌ అల్లు అరవింద్‌ నా జీవితంలో నిజమైన 'తండేల్‌'. గత ఏడాదిన్నర నుంచి ఆయనతో ప్రయాణం చేస్తున్నాను.

ఆయన లేకుండా నేను మరో సినిమా చేయగలనా అనే భావన కలిగింది. ఈ సినిమాకు ఆయన సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక వైజాగ్‌తో నాకున్న అనుబంధం ప్రత్యేకమైనది. నా సినిమా విడుదలైన వెంటనే మొదటగా వైజాగ్‌ టాక్‌ తెలుసుకుంటాను. వైజాగ్‌లో సినిమా ఆడితే ప్రపంచం మొత్తం ఆడినట్లే. 

వైజాగ్‌ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో రూలింగ్‌ పార్టీ వైజాగ్‌ వాళ్లదే. కాబట్టి మీకో విన్నపం. 'తండేల్‌' సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్‌ షేక్‌ అవ్వాలి. లేదంటే మా ఇంట్లో నా పరువు పోతుంది" అన్నారు. 

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, "హీరో నాగచైతన్య కెరీర్‌లో ఉత్తమ నటనను ఈ సినిమాలో చూస్తారు. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మన గుండె కరిగిపోయేలా నటించాడు. ఈ సినిమాతో చైతన్య మంచి నటుడు అనిపించుకుంటాడు" అని తెలిపారు. అయితే ఈ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో హీరోయిన్‌ సాయి పల్లవి, దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు పాల్గొనలేదు. 


Thandel
Naga Chaitanya
Thandel trailer
Vizag
Allu aravind
Sai Pallavi
tollywood
Chandu moondeti

More Telugu News