Land Grabbing: ఇవాళ బయటికొచ్చిన పెద్దిరెడ్డి భూభాగోతం కొంతే... ఇంకా చాలా ఉంది: మంత్రి డీవీబీ స్వామి

DVB Swamy reacts on Peddireddy alleged land grabbing
  • మంగళంపేట అటవీప్రాంతంలో భూఆక్రమణల వ్యవహారం
  • మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు
  • గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలకు అడ్డే లేకుండాపోయిందన్న స్వామి
  • అందరి భాగోతాలు త్వరలో బయటికొస్తాయని వెల్లడి
వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మంగళంపేట అటవీప్రాంతంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణకు పాల్పడిందన్న సమాచారంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పందించారు. 

గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల భూ అక్రమాలకు అడ్డే లేకుండా పోయిందని విమర్శించారు. ఇవాళ బయటికొచ్చిన పెద్దిరెడ్డి భూ దోపిడీ కొంతేనని... బయటికి రావాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. అందరి భాగోతాలు త్వరలో బయటికి వస్తాయని మంత్రి డీవీబీ స్వామి స్పష్టం చేశారు. 

ఇక, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేస్తోందని చెప్పారు. ఇప్పటికే పింఛను పెంపు, ఉచిత సిలిండర్ పథకం అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని తెలిపారు.
Land Grabbing
Peddireddi Ramachandra Reddy
DVB Swamy
TDP
YSRCP

More Telugu News